ఎల్బీనగర్/వనస్థలిపురం/మన్సూరాబాద్/హయత్‌నగర్, జూలై 27: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం తన నివాసం నుంచి దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సాగర్ రింగ్‌రోడ్డులోని హస్తినాపురంలోని జీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు, సానుభూతిపరులు, కాలనీ సంక్షేమసంఘాల పరతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుధీర్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్‌లు కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా సాగర్ రహదారి పూర్తిగా గులాబీమయంగా మారింది. వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.
ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ హయత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్‌గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు జన్మదిన వేడుకల్లో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హయత్‌నగర్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ యువజన సంఘం నాయకులు, అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా చెన్నగోని శ్రీధర్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం అనునిత్యం, అహర్నిశలు కృషిచేస్తున్న నిరంతర శ్రామికుడు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం, కాలనీల్లో అభివృద్ధికి సుధీర్‌రెడ్డి సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. ఎల్బీనగర్ గడ్డపై మరోసారి సుధీర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నగోని రవీందర్‌గౌడ్, దీపావళి శ్రావణ్‌కుమార్, డివిజన్ జనరల్ సెక్రటరీ యానాల కృష్ణారెడ్డి, గుజ్జ జగన్మోహన్రెడ్డి, దీపావళి శ్రీకాంత్, ఇంద్రకరణ్‌రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు డ్యాగల రాకేశ్ కుమార్, మహ్మద్ రఫీక్, లింగం మనోజ్, ప్రవీణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు, నియోజకవర్గంతోపాటు జంట నగరాల నుంచి ఆయన అభిమానులు తరలివచ్చి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి గజమాలతో సత్కరించారు. కేక్‌ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హస్తినాపురం మాజీ కార్పొరేటర్ పద్మానాయక్, డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యంచారి, వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ ఆధ్వర్యంలో నాయకులు తరలివెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేరెడ్డి ఉదయ్‌కుమార్‌రెడ్డి, చాపల శ్రీనివాస్‌యాదవ్, అనిల్‌కుమార్ చౌదరి, మువ్వ సతీశ్ చౌదరి, శ్రీధర్‌గౌడ్, కొంగరి మహేశ్, నారగోని శ్రీనివాస్ యాదవ్, పోగుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
వనస్థలిపురం డివిజన్లోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో గురువారం నిర్వహించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి జన్మదిన వేడుకలకు మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాయకుడు జక్కిడి రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాయకుడు జక్కిడి రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన ఎమ్మెల్యే చిత్రపటంతో కూడిన జ్ఞాపికను ఎమ్మె ల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి అందజేశారు. పేద విద్యార్థుల కోసం సమకూర్చిన నోటు పుస్తకాలను ఎమ్మెల్యేకు అందజేశారు. అదేవిధంగా మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, నాగోల్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, నాయకులు అనంతుల రాజిరెడ్డి, చెరుకు ప్రశాంత్‌గౌడ్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో దుర్గెంపూడి సాంబిరెడ్డి, తూర్పాటి కృష్ణ, జగదీశ్‌యాదవ్, నాగరాజు, నర్రి వెంకన్న, రుద్ర యాదగిరి, వట్నాల విశ్వేశ్వరరావు, పాలబిందెల మహేశ్ తదితరులు ఉన్నారు.