కొండాపూర్, ఏప్రిల్ 24 : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి జోన్ మియాపూర్ సర్కిల్లో విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన సహచర ఉద్యోగులు, సిబ్బంది వెంటనే స్థానిక దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కాగా ఉదయం నుంచి చురుకుగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మృతి చెందడాన్ని మియాపూర్ సర్కిల్ ఉద్యోగులు నమ్మలేకపోతున్నట్లు, హార్ట్ స్ట్రోక్ కారణంగానే మృతి చెంది ఉంటాడని ఉద్యోగులు వాపోతున్నారు. కాగా సర్కిల్ అధీనంలో ఉన్న అంబేద్కర్ కళ్యాణ మండపం ఇంచార్జిగా ఉన్న వెంకటేష్ మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఇంతలోనే ఇలా జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.