హైదరాబాద్ : నగరంలోని ఆహారప్రియుల కోసం పేరెన్నికగన్న లులూమాల్( Lulu Mall ) లో సరికొత్త ఫైర్ స్టోన్ గ్రిల్ బఫే రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా శుక్రవారం కూకట్‌పల్లిలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageshwar Rao), సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి తో కలిసి ఇందుకు సంబంధించిన రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
దిగుమతి చేసుకున్న ఓల్కనిక్ స్టోన్ (Volcanic Stone) పై వంటలన్నీ చేయడంతో దాని ఫ్లేవర్‌తో కలిసి ఒక సరికొత్త రుచి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఒకేసారి 200 మందికి పైగా ఇక్కడ కూర్చుని రుచులను ఆస్వాదించవచ్చని వెల్లడించారు. అంతర్జాతీయంగా పేరెన్నికగన్న షెఫ్(International Chefs) లను తీసుకొచ్చి, అన్నిరకాల ఆహారపదార్థాలను సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఇక్కడ ఉన్నవాటిలో 60 శాతం మాంసాహార, 40 శాతం శాకాహార వంటకాలు ఉంటాయని పేర్కొన్నారు.

ఓల్కనిక్ స్టోన్ మీద వండటం వల్ల ఆహారంలో కొవ్వు పదార్థాలు (Fat content) తగ్గడంతో పాటు, సహజమైన రుచి యథాతథంగా ఉంటుందని రెస్టారెంటు భాగస్వాములు సూర్యదేవర అజయ్, సూర్యదేవర శ్రీలక్ష్మి, గౌతమ్ అన్నారు. రెస్టారెంటులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రుచులను ప్రవేశపెట్టామని, స్పానిష్, ఫ్రెంచ్, మెక్సికన్ లాంటి అనేక రుచులను ఆస్వాదించవచ్చని తెలిపారు. వాటితో పాటు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వివిధ రుచులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయని, మాంసాహారంలో కేవలం చికెన్, మటన్ చేపలు ఉంటాయి తప్ప బీఫ్, పోర్క్ లాంటివి ఉండవని వివరించారు.