అమీర్‌పేట్, సెప్టెంబర్ 9 : పారిశుధ్య నిర్వహణలో జీహెచ్ఎంసీ కార్మికుల సేవలు వెలకట్టలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ జోన్ పారిశుధ్య కార్మికులకు 15 రకాల రక్షణ వస్తువులతో కూడిన కిట్లను వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసంలో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ కొవిడ్ సమయంలో ముందు వరుసలో ఉంటూ సేవలందించారన్నారు. విధి నిర్వహణలో కిట్టులోని వస్తువులను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం కార్మికులకు మట్టి గణపతులను అందజేశారు.
సనత్‌నగర్ జెక్కాలనీలో.. సనత్‌నగర్ జెక్కాలనీలో విజయ్ గ్రాండ్యూర్ అపార్ట్మెంట్స్ ఆవరణలో దేవాదాయ సహాయ కమిషనర్ అన్నపూర్ణ, జ్వాలా సత్యనారాయణ దంపతులు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. సంప్రదాయ పద్ధతిలో మట్టితో రూపుదిద్దుకున్న వినాయక ప్రతిమలనే పూజలకు వినియోగించాలన్నారు.
ఎస్ఆర్నగర్ వయోధికుల మండలిలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. మండలి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సనత్‌నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీబాల్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మండలి అధ్యక్షుడు కాసాని సహదేవ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.