హైదరాబాద్ : క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రాజేశ్వరరావుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందనలు తెలిపారు. గురువారం నాంపల్లిలోని గృహకల్పలో ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ హాజరై రాజేశ్వరరావుకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. భవిష్యత్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఉన్నతంగా పని చేస్తూ సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.