సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతి పెద్ద నమూనాల తయారీ కేంద్రమైన టీ వర్క్స్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదివారం సందర్శించారు. టీ వర్క్స్‌లో ఏర్పాటు చేసిన తయారీ యంత్రాలను మంత్రి పరిశీలించారు.
ముఖ్యంగా టీ వర్క్స్‌లో ఉన్న మౌలిక వసతులు, అందులో జరుగుతున్న కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. భౌతిక ఆవిష్కరణలు జరిగేందుకు టీవర్క్స్ ఎంతో అనుకూలంగా ఉందన్నారు.