సుల్తాన్‌బజార్,ఆగస్టు 9. టీఎన్జీవో యూనియన్ ఉ ద్యోగులు ప్రభుత్వంలో భాగమని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం టీఎన్జీవో హైదరాబా ద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ముజీబ్ హుస్సేనీ నేతృత్వంలో జిల్లా నాయకులు హోం మంత్రిని తన చాంబర్లో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ సభ్యులు కృషి చేయడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల సంక్షేమానికి పాటు పడుతున్నారన్నారు. ముజీబ్‌హుస్సేనీ మాట్లాడుతూ.. టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖకు హోం మంత్రి అందిస్తున్న సహాయ సహకారాలకు గాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ కార్యదర్శి విక్రమ్ కుమార్, కోశాధికారి బాలరాజు, ఉపాధ్యక్షులు రాజ్‌కుమార్, ఉమర్ఖాన్,సంయుక్త కార్యదర్శి ఖాలేద్ అహ్మద్, హరిబాబు, ప్రచార కార్యదర్శి శ్రీనివాస్,కార్యవర్గ సభ్యులు శంకర్ పాల్గొన్నారు.