ఎల్బీనగర్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్‌కు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు బొక్క సదానంద్రెడ్డితో పాటు యువకులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఎల్బీనగర్, అక్టోబర్ 24: ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్‌కు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు బొక్క సదానంద్రెడ్డితో పాటు యువకులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధిస్తుందన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్నారు. బీఆర్ఎస్లో చేరిన బొక్క సదానందరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడనై బీఆర్ఎస్లో చేరానన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎల్బీనగర్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు కార్తిక్‌రెడ్డి, ముద్ద పవన్‌తో పాటుగా పార్టీలో చేరిన వారిలో చందు,మనీశ్, హకీం, అంజి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

