వాషింగ్టన్, జూలై 9: అమెరికాలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక స్క్రిప్స్ నేషనల్ ‘స్పెల్లింగ్-బీ’ పోటీల్లో తొలిసారి ఆఫ్రికన్ అమెరికన్ విద్యార్థి విజేతగా నిలిచారు. లూసియానాకు చెందిన జైలా అవంత్ గార్డె (14) ఈ ఏడాది చాంపియన్గా అవతరించారు. దీంతో గత 93 ఏండ్లుగా జరుగుతున్న ఈ పోటీల్లో గెలిచిన రెండో నల్లజాతీయురాలుగా జైలా ఘనత సాధించారు. ఈ పోటీల్లో తెలుగు మూలాలున్న చైత్ర తుమ్మల, భావన మదిని వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ఈ కార్యక్రమానికి హాజరైన అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ విజేతలను అభినందించారు. ‘స్పెల్లింగ్-బీ’ ఛాంపియన్గా నిలిచిన వారికి 50 వేల అమెరికన్ డాలర్లను బహుమతిగా ఇస్తారు. కాగా.. బాస్కెట్ బాల్ క్రీడాకారిణి అయిన జైలా పేరిట మూడు గిన్నిస్ బుక్ రికార్డులు కూడా ఉన్నాయి. ఏకకాలంలో ఒకటి కన్నా ఎక్కువ బంతులతో బాస్కెట్బాల్ ఆడి ఆమె రికార్డు సృష్టించారు.