జవహర్‌నగర్, జూన్ 25: జవహర్‌నగర్ కార్పొరేషన్ 27వ డివిజన్లో ప్రతి కాలనీలో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనుల కోసం రూ. కోటి కేటాయించినందుకు మంత్రి మల్లారెడ్డికి కార్పొరేటర్ జిట్టా శ్రీవాణీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలు వేద మంత్రోచ్ఛరణల మధ్య పుష్పాభిషేకం చేశారు. మంత్రి మల్లారెడ్డి వచ్చిన తర్వాతే మా డివిజన్ బాగుపడిందంటూ.. ప్రజలు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సాయిబాబా కమాన్ నుంచి దివ్యాంగుల కాలనీకి వెళ్లే రహదారి గుంతలమయంగా ఉండేదని, 30 ఏండ్ల నాటి అవస్థలు శాశ్వతంగా దూరం చేసినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు.
జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో రూ.9కోట్లతో చేపట్టనున్న ప్రగతి పనులకు మంత్రి మల్లారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబునగర్ కాలనీవాసులు మంత్రి మల్లారెడ్డికే మా మద్దతు అంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. గత పాలకులు ఎవరూ మా డివిజన్‌ను పట్టించుకోలేదని, 30 ఏండ్ల నుంచి అవస్థలు పడుతున్నామని, తెలంగాణ ప్రభుత్వంలోనే.. మంత్రి మల్లారెడ్డి వచ్చిన తర్వాతే మా డివిజన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటూ చంద్రబాబునగర్ కాలనీవాసులు పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డికే మా మద్దతంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి.. తీర్మాణ ప్రతిని కార్పొరేటర్ ఏకే మురుగేశ్ ఆధ్వర్యంలో మంత్రికి అందజేశారు. మా కాలనీలో ప్రతి ఇంట్లో మంత్రి మల్లారెడ్డి ఫొటోలు పెట్టుకుంటామని తెలిపారు. అనంతరం మంత్రి మల్లారెడ్డికి బోనాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పుచప్పుల్లతో ఘన స్వాగతం పలికారు.