మెట్రో.. మెరుగైన సేవలేవి?
మెట్రో రైలు ప్రయాణం ఇప్పుడు సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. మెట్రో సేవల విస్తరణపై ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం... స్వాధీనం చేసుకుని చేతులు దులుపుకొన్నది. ఆచరణలో ఏమాత్రం సాధ్యం కానీ హామీలతో మెట్రో వ్యవస్థను బలహీన పరుస్తోంది.
- ప్రయాణికులకు తప్పని కష్టాలు
- కొత్త కోచ్‌లు.. సమయం పెంపు ఊసే లేదు
- సర్కార్ నిర్లక్ష్యంతో పడకేసిన వ్యవస్థ
- 10 శాతం తగ్గిన ప్రయాణికుల రద్దీ
- ఐటీ కారిడార్‌లో గంటల తరబడి నిరీక్షణ
సిటీబ్యూరో, మే 13(నమస్తే తెలంగాణ): మెట్రో రైలు ప్రయాణం ఇప్పుడు సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. మెట్రో సేవల విస్తరణపై ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం… స్వాధీనం చేసుకుని చేతులు దులుపుకొన్నది. ఆచరణలో ఏమాత్రం సాధ్యం కానీ హామీలతో మెట్రో వ్యవస్థను బలహీన పరుస్తోంది. దీంతో ఇప్పటికే ప్రయాణికుల రద్దీ తగ్గగా, వచ్చే జనాలకు మెరుగైన రవాణా సేవలు లేకుండా పోయిందని వాపోతున్నారు. ప్రధానంగా అదనపు కోచ్‌ల కొనుగోళ్లు, రైళ్ల ఫ్రీక్వెన్సీ, ప్రయాణ సమయాల పొడిగింపు వంటి కీలక అంశాలను సర్కారు అటకెక్కించింది. ఫలితంగా రద్దీ వేళలలో మెట్రో ప్రయాణం నరక కూపంలా మారిందని వాపోతున్నారు.
నిర్వహణ గాలికి
మూడు కోచ్‌లను ఆరు కోచ్‌లకు పెంచుతామని గతేడాది ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో అప్పట్లోనే లీజు ప్రాతిపదికన కోచ్‌లను తెప్పించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. కానీ కాలం గడిచినా ఇప్పటి వరకు చర్చలు ముందుకు రాలేదు. కనీసం కొత్త కోచ్‌లను ఏర్పాటు చేస్తామని కూడా ఇప్పటివరకు వెల్లడించలేదు. ఇక పెరిగిన రద్దీకి అనుగుణంగా సరిపడా రద్దీ లేదు. రాత్రి 11గంటలకే సేవలు నిలిచిపోవడంతో ఐటీ ఉద్యోగులతోపాటు నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం అర్థరాత్రి 12 గంటల వరకు కూడా రైళ్లను నడిపే సాహసం ప్రభుత్వం చేయడం లేదు.
రద్దీకి అనుగుణంగా..
మెట్రో రైళ్లలో రద్దీకి అనుగుణంగా సేవలను పెంచడంలో సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నది. ముఖ్యంగా ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్ నుంచి రాయదుర్గం కారిడార్లలో ఉదయం, సాయంత్రం రైలు ఎక్కాలంటే ప్రయాణికులు కుస్తీ పట్టాల్సిన పరిస్థితి. వాస్తవానికి రద్దీ కూడా గతేడాదితో పోల్చితే 10శాతం తగ్గింది. అయినా ఉన్న ప్రయాణికులకు సరిపడా సౌకర్యంగా మెట్రో ప్రయాణం లేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

