SIR | ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలు ఉర్దూలో కూడా ప్రచురించాలి : ఎండీ యాకూబ్ పాషా
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలు ఓటర్లకు పంపిణీ చేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను ఉర్దూ భాషలో కూడా అందుబాటులో ఉంచాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలు ఓటర్లకు పంపిణీ చేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను ఉర్దూ భాషలో కూడా అందుబాటులో ఉంచాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగుతో పాటు ఉర్దూ కూడా అధికారిక ద్వితీయ భాష అయినప్పటికీ, ఎన్నికల కమిషన్ ఎన్యూమరేషన్ ఫారాలను ఉర్దూలో ముద్రించకపోవడం లక్షలాది ఉర్దూ మాట్లాడే ఓటర్లకు ఇబ్బందులు కలిగిస్తోందని అన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్లో ఆంగ్ల భాషలో, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో తెలుగులో మాత్రమే ఫారాలను అందిస్తున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. ఉర్దూ మాతృభాషగా ఉన్న వృద్ధులు, నిరక్షరాస్యులు, సాధారణ ప్రజలు ఫారాలను సరిగా అర్థం చేసుకుని పూరించడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి అర్హుడైన ఓటరికి తన భాషలో సేవలు అందించడం ఎన్నికల కమిషన్ బాధ్యత అని పేర్కొన్నారు.
అందువల్ల ఎన్నికల కమిషన్ వెంటనే ఉర్దూ భాషలో కూడా ఎన్యూమరేషన్ ఫారాలను ముద్రించి పంపిణీ చేయాలని అలాగే ఉర్దూ మాట్లాడే ప్రాంతాల్లో ఉర్దూ తెలిసిన సిబ్బందిని నియమించి ఓటర్లకు అవసరమైన సహాయం అందించాలని యాకూబ్ పాషా కోరారు. భాషా సమానత్వాన్ని గౌరవిస్తూ ప్రతి ఓటరికి సులభంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు లేఖ రాయనున్నట్లు యాకూబ్ పాషా తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

