ఎస్టీపీ పనులు వేగిరం చేయండి
జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి బుధవారం ఎస్టీపీ పనుల పురోగతిని పరిశీలించారు. అత్తాపూర్, మిరాలంలో నిర్మిస్తున్న ఎస్టీపీలతోపాటు హసన్‌నగర్‌లో ఉన్న ఐఅండ్డీలను ఆయన సందర్శించారు.
సిటీబ్యూరో, మే 15(నమస్తే తెలంగాణ): జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి బుధవారం ఎస్టీపీ పనుల పురోగతిని పరిశీలించారు. అత్తాపూర్, మిరాలంలో నిర్మిస్తున్న ఎస్టీపీలతోపాటు హసన్‌నగర్‌లో ఉన్న ఐఅండ్డీలను ఆయన సందర్శించారు. ముందుగా అత్తాపూర్ ఎస్టీపీకి వెళ్లిన ఆయన నిర్మాణ పనులు పరిశీలించి వేగంగా చేయాలని ఆదేశించారు. అనివార్య కారణాలతో పనులు ఆలస్యమైనప్పటికీ సకాలంలో పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
అనంతరం ఇటీవల పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మిరాలం ఎస్టీపీని సందర్శించి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సమీప కాలనీల నుంచి చెరువులోకి మురుగు చేరే పాయింట్లను గుర్తించారు. ఈ మురుగు చెరువులో చేరకుండా, చెరువు చుట్టూ ఉన్న పైపులైన్లను అనుసంధానం చేసి కొత్తగా నిర్మిస్తున్న ఎస్టీపీలోకి మళ్లించాలని ఆదేశించారు. ఈ మళ్లింపు పనులకు జీహెచ్ఎంసీ, నీటిపారుదల శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలన్నారు. పని జరిగే ప్రదేశంలో రక్షణ చర్యలు చేపట్టాలని ఎండీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈడీ డాక్టర్ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్, సీజీఎం సుదర్శన్, జీఎం, ఎస్టీపీల అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

