మాదన్నపేట,అక్టోబర్ 25: ఎంబీఎస్ జువెల్లర్స్ ఎండీ సుఖేశ్ గుప్తాను ఈడీ అధికారులు 9 రోజులు కస్టడీకి తీసుకున్నారు. సుఖేశ్ గుప్తాను 14 రోజుల కస్టడీకి కోరుతూ ఈ నెల 20వ తేదీన ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ అనంతరం మంగళవారం 9 రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చంచల్గూడ జైలులో ఉన్న సుఖేశ్ గుప్తాను ఈడీ అధికారులు తమ కార్యాలయానికి తరలించారు.