సిటీబ్యూరో, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): మహా నగరం పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ 100 శాతం కొవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఇంకా కొనసాగుతున్నదని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. నాలుగో రోజైన గురువారం పెద్ద ఎత్తున టీకా ప్రక్రియను చేపట్టారు. 1333 కాలనీలు వంద శాతం వ్యాక్సిన్ తీసుకున్న కాలనీలుగా ప్రకటించి, దాదాపు 1200 కాలనీలకు ప్రత్యేక అభినందన సర్టిఫికెట్లను అందజేశారు. 18 ఏళ్లకు పైబడ్డ వారి కి 100 శాతం కొవిడ్ వ్యాక్సిన్ పూర్తి చేసేందుకు మేయర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. నగరంలో పలు ప్రాంతాలలో పర్యటించిన మేయర్ 100 శాతం వ్యాక్సిన్ పూర్తయిన కాలనీ వాసులకు సర్టిఫికేట్‌ను అందజేశారు.
అంబర్‌పేటలోని అనంతరాంనగర్ కాలనీలో, ముషీరాబాద్‌లో కళాధర్ నగర్, గాం ధీనగర్లోని వివేక్‌నగర్‌లో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి మేయర్ పర్యటించి కాలనీలకు సర్టిఫికెట్లను అందజేశారు. బుధవారం వరకు 1365 కాలనీలలో వంద శాతం పూర్తి చేశామని, గ్రేటర్లో గురువారం 39,110 మంది టీకా వేసుకు న్నారని తెలిపారు. ప్రజల సహకారంతో, ప్రజా ప్రతినిధులు, అధికారుల సాయంతో మరిన్ని కాలనీలను పూర్తి చేస్తామని మేయర్ చెప్పారు. అయితే, ఫస్ట్ డోస్ వేసుకున్న వారు 31, 888 మంది కాగా, రెండో డోస్ వేసుకున్న వారు 7,222 మం దిగా పేర్కొన్నారు.
వచ్చే నెల 1న సూళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్ర భుత్వ పాఠశాలల శానిటేషన్ బాధ్యతలు జీహెచ్ఎంసీ అప్పగించారు. ఈ నేపథ్యంలో పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మేయర్ పలు స్కూళ్లను సందర్శించారు. అంబర్‌పేటలోని ప్రభుత్వ పాఠశాల, ముషీరాబాద్ జవహర్‌నగర్ లోని ప్రైమరీ సూల్లో శానిటేషన్ పనులను మేయర్ పరిశీలించా రు. సూల్ పరిసరాలు పూర్తిగా శుభ్రం చేయాలని ఈ సందర్భంగా మేయర్ అధికారులను ఆదేశించారు.
సూళ్లన్ని చోట్ల క్షుణ్ణంగా పరిశీలించి ఎకడా లోపాలు ఉండ కూడదని, మన పిలల్లే బడికి వెళతారనుకొని పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ జిల్లాలో 690 గవర్నమెంట్ సూళ్లకు రంగారెడ్డి జిల్లాలో 167 గవర్నమెంట్ సూళ్లు, గవర్నమెంట్ కాలేజీలకు మేడ్చల్ జిల్లాలో 276 గవర్నమెంట్ సూళ్లు మొత్తం 1,133 సూళ్లలో జీహెచ్ఎం సీ పారిశుద్ధ్య పనులను చేస్తుందని మేయర్ వివరించారు. ఈ నెల 30వ తేదీలోగా పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సూల్, కాలేజీలను శుభ్రం చేస్తామని మేయర్ తెలిపారు .