హైదరాబాద్ : రూ. కోటి విలువైన హెల్త్ కిట్లను హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి శుక్రవారం పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2,374 మంది కార్మికులకు రూ.4,133 విలువ గల హెల్త్ కిట్‌ను అందజేశారు. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి కిట్‌లో ఉద్యోగులకు ఉపయోగపడే మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు, బూట్లు, రెయిన్కోట్లు మొదలైన 11 రకాల వస్తువులు ఉన్నట్లు మేయర్ చెప్పారు. జీహెచ్ఎంసీలోని 5 వేల మంది కార్మికులందరికి ఈ హెల్త్ కిట్లను అందజేయనున్నట్లు వెల్లడించారు.
Distributed Safety health kits worth ₹1 Cr to GHMC sanitation workers. Each kit costs ₹4133 containing 56 masks, radium jacket, raincoat, gloves, safety shoes, soaps, towels, & Sanitizers at GHMC office along with @SrilathaMothe,@ACHEALTH_GHMC & @GHMCOnline officials. @KTRTRS pic.twitter.com/6onORcnzPq
— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@GadwalvijayaTRS) June 4, 2021