కుర్చీలాట!
స్వయంగా పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి శాఖలోనే రోజుల తరబడి ఇంజినీర్ల కుర్చీలాట జరుగుతోంది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ముఖ్య అధికారి రెండు వారాల కిందట భారీ ఎత్తున ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు బదిలీలు జరిపారు. అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో సస్పెన్షన్కు గురైన ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్కి బదిలీ బహుమతి ఇవ్వడం, జీవో నంబరు 38 ఉల్లంఘన తదితర అంశాలను ‘నమస్తే’ ప్రత్యేక కథనంతో వెలుగులోకి తీసుకువచ్చింది.
- ట్రై కమిషనరేట్లలో భారీగా ఇంజినీర్ల బదిలీలు
సిటీబ్యూరో: స్వయంగా పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి శాఖలోనే రోజుల తరబడి ఇంజినీర్ల కుర్చీలాట జరుగుతోంది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ముఖ్య అధికారి రెండు వారాల కిందట భారీ ఎత్తున ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు బదిలీలు జరిపారు. అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో సస్పెన్షన్కు గురైన ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్కి బదిలీ బహుమతి ఇవ్వడం, జీవో నంబరు 38 ఉల్లంఘన తదితర అంశాలను ‘నమస్తే’ ప్రత్యేక కథనంతో వెలుగులోకి తీసుకువచ్చింది.
సీఎంవో కార్యాలయం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ముఖ్య అధికారిని మందలించడం..అలాగే ఈ బదిలీలను ట్రై కమిషనరేట్ల కమిషనర్లు తేలిగ్గా తీసుకున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ మాత్రం ఈ బదిలీని నిలిపివేయాలని, పరిగణనలోకి తీసుకోవద్దంటూ సంబంధిత ఇంజినీరింగ్ విభాగానికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అందరూ బదిలీలు నిలిచిపోయినట్టేనని భావించారు..కానీ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పనిచేస్తున్న ఈఈలు బదిలీ స్థానమైన జీహెచ్ఎంసీలో రిపోర్ట్ చేశారు.
ఇక్కడి నుంచి బదిలీ అయిన వారు రిలీవ్ కాకపోవడం, రిపోర్ట్ చేసిన వారికి పోస్టింగ్ దక్కకపోవడం మున్సిపల్ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతున్నది. ట్రై కార్పొరేషన్ కమిషనర్ల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. జీహెచ్ఎంసీ, సీఎంసీ మినహా, మిగిలిన ఎంఎంసీ పరిధిలోని ఇంజినీర్లు గంపగుత్తగా రిలీవ్ అయ్యారు. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఈ బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇకడి ఇంజినీర్లను రిలీవ్ చేసేందుకు కమిషనర్ కర్ణన్ నిరాకరించడమే ఇందుకు కారణం. గడిచిన కొన్ని రోజులుగా కమిషనర్ సెలవులో ఉండడంతో బదిలీపై వచ్చిన వారు, బదిలీకి నోచుకున్న వారు అందరూ జీహెచ్ఎంసీలోనే కొనసాగుతుండడం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

