కేపీహెచ్‌బీ కాలనీలో డబుల్ బెడ్రూం మోసం
గవర్నమెంట్ ఆఫీస్‌లో తనకు పెద్ద సార్లతో పరిచయం ఉంది. మీరు రూ.2 లక్షలు ఇస్తే డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తారు.. అంటూ మాయమాటలు చెప్పిన ఓ వ్యక్తి 16 మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. బాధితులకు నకిలీ అలాట్మెంట్ లెటర్లు, తాళం చెవులను సైతం ఇచ్చి.. వసూలు చేసిన డబ్బుతో పరారయ్యాడు.
- 16 మంది నుంచి డబ్బులు వసూలు
- పోలీసులను ఆశ్రయించిన బాధితులు
కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 29: గవర్నమెంట్ ఆఫీస్‌లో తనకు పెద్ద సార్లతో పరిచయం ఉంది. మీరు రూ.2 లక్షలు ఇస్తే డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తారు.. అంటూ మాయమాటలు చెప్పిన ఓ వ్యక్తి 16 మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. బాధితులకు నకిలీ అలాట్మెంట్ లెటర్లు, తాళం చెవులను సైతం ఇచ్చి.. వసూలు చేసిన డబ్బుతో పరారయ్యాడు. ఈ ఘటన కేపీహెచ్‌బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన టి.రామలక్ష్మికి అల్వాల్‌లో నివసించే ఓ వ్యక్తి ద్వారా వేణుగోపాల్ దాస్, స్నేహా రామ్మూర్తి దంపతులు పరిచయమయ్యారు. వేణుగోపాల్ దాస్.. తాను గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు చేయిస్తుంటానని, మున్సిపల్ ఆఫీసుల్లో పెద్ద సార్లు తనకు తెలుసునని నమ్మించాడు.
తనకు రూ. రెండు లక్షలు ఇస్తే డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని రామలక్ష్మికి మాయమాటలు చెప్పాడు. వేణుగోపాల్ దాస్ కుటుంబ సభ్యులు మాటలను నమ్మిన రామలక్ష్మి.. కేపీహెచ్‌బీ కాలనీలో తనకు పరిచయమున్న మరో 13 మందికి ఈ విషయం చెప్పింది. తాను మూడు ఫ్లాట్లను కొనుగోలు చేస్తూ.. మరో 13 మంది 13 ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు వేణుగోపాల్ దాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. నమ్మకం కలిగించేందుకు 13 మందిని గండి మైసమ్మ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇండ్ల వద్దకు తీసుకెళ్లాడు. మొత్తం 16 డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు కోసం ఒక్కొక్కరి వద్ద రూ.1,70,000 నగదు తీసుకున్నాడు. వారిలో కొందరు రూ.2.50 లక్షల వరకు చెల్లించారు. వారంతా వేణుగోపాల్దాస్కు, అతడి భార్య స్నేహా రామ్మూర్తి, బావమరిది రాహుల్ రామ్మూర్తికి గూగుల్ పే, ఫోన్ పే, నగదు, బ్యాంకు చెక్కుల ద్వారా డబ్బును చెల్లించారు.
అతడు గండి మైసమ్మలో చూపించిన డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన ఇంటి నంబర్లతో నకిలీ అలాట్మెంట్ సర్టిఫికెట్లు, తాళం చెవులను డబ్బులు చెల్లించిన వారికి అప్పగించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు బాధితులంతా డబుల్ బెడ్రూం ఇండ్లకు వెళ్లి చూడగా.. ఆ ఇండ్లలో అసలైన లబ్ధిదారులు కనిపించారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు.. అతడి ఆచూకీ కోసం అల్వాల్ వెంకటాపురంలో ఉన్న నివాసానికి వెళ్లారు. డబుల్ బెడ్రూం ఇండ్లపై ప్రశ్నించడంతో వారిపైనే కేసు పెట్టాడు. మరికొద్ది రోజులకు వెళ్లి చూడగా.. అతడు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. భార్య, బావమరిది కూడా అందుబాటులోకి రాలేదు. ఫోన్లు స్విచ్చాఫ్ రావడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులంతా కేపీహెచ్‌బీ కాలనీ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

