జీడిమెట్ల, జనవరి 2: ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఓ లారీ దగ్ధమైన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. జీడిమెట్ల ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన ప్రకారం… సుభాష్‌నగర్‌లోని దక్కన్ ట్రాన్స్‌పోర్టులో విజయవాడకు చెందిన లారీ(ఏపీ 16వై 6246)లో హార్డ్‌వేర్, పెయింట్స్, టిన్నర్ లోడ్‌తో బుధవారం రాత్రి 10 గంటలకు విజయవాడకు బయలుదేరింది.
కిలో మీటరు ప్రయాణించగానే జీడిమెట్ల పారిశ్రామికవాడకు చేరుకోగానే ఆకస్మికంగా లారీలో మంటలు వచ్చి అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో 3గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో లారీ సగానికి పైగా కాలిపోయింది. మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్ కిందికి దిగి పరారైనట్లు ఎస్ఐ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.