హైదరాబాద్ : పోలీస్ స్టేషన్ భవనం రెండో అంతస్తు పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. నగరంలో ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఓ చోరీ కేసులో ప్రశ్నించేందుకు పోలీసులు నిందితుడిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ క్రమంలో అతడు పోలీసుల నుంచి తప్పించుకొని రెండో అంతస్తు పైనుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. నిందితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన దవాఖానకు తరలించారు.