మాన్యువల్ దోపిడీ
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలను పారదర్శకంగా అందించేందుకు ఆన్లైన్ విధానాన్ని తీసుకొస్తే.. మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లోని అడ్వర్టయిజ్మెంట్ విభాగం అధికారులు మాత్రం మాన్యువల్ దోపిడీకి తెర లేపారు. పారదర్శకతకు మంగళం పాడుతూ చేతిరాత దరఖాస్తులతో లక్షల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
- ఆన్లైన్ విధానానికి మంగళం.. లక్షల్లో అక్రమ వసూళ్లు
- నిబంధనలకు విరుద్ధంగా ఫామ్-1 దందాతో వ్యాపారులకు బెదిరింపులు
- చర్చనీయాంశంగా మలాజిగిరి మున్సిపల్ అధికారుల తీరు
సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలను పారదర్శకంగా అందించేందుకు ఆన్లైన్ విధానాన్ని తీసుకొస్తే.. మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లోని అడ్వర్టయిజ్మెంట్ విభాగం అధికారులు మాత్రం మాన్యువల్ దోపిడీకి తెర లేపారు. పారదర్శకతకు మంగళం పాడుతూ చేతిరాత దరఖాస్తులతో లక్షల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలోనే ప్రకటనల అనుమతులన్నింటినీ ఆన్ లైన్ పరిధిలోకి తీసుకొచ్చారు.
వ్యాపార సముదాయాలకు సంబంధించి గ్లో సైన్ బోర్డులు, నేమ్ బోర్డులు, ఫిక్స్డ్ బోర్డుల అనుమతుల కోసం వ్యాపారులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకుని ఫీజులు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ ఆన్లైన్ జమానాలో మలాజిగిరి అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆన్ లైన్ పోర్టల్‌ను పకనపెట్టి, మాన్యువల్ గా ఫామ్-1 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తూ చేతిరాత అనుమతులు జారీ చేస్తున్నారు. ఇందుకు ఉప్పల్ సర్కిల్లని ఓ హోం నీడెడ్ షాప్‌కి 122 స్కేర్ మీటర్లలో నేమ్ బోర్డు ఏర్పాటుకు ఆఫ్‌లైన్ అనుమతి ఇచ్చి సంబంధిత యజమానికి రూ.4 లక్షల వరకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడం గమనార్హం. మాన్యువల్ విధానంలో ఫీజుల చెల్లింపులు జరపడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బోర్డుల అనుమతుల పేరుతో వ్యాపారస్తులను అధికారుల సిబ్బంది భ్రాంతులకు గురిచేస్తున్నారని, బెదిరించి భారీగా వసూళ్లకు పాల్పడుతూ.. తమ జేబులు నింపుకొంటున్నారని స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. ఆన్లైన్ విధానం స్పష్టంగా అమలులో ఉన్నప్పుడు మాన్యువల్ ఫారాలతో అనుమతులివ్వడానికి ఉన్నతాధికారుల అనుమతి ఉందా? ప్రత్యేక పులు ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నిస్తే.. అలాంటి మినహాయింపులేవీ లేవని ఉన్నతాధికారులు చెబుతుండడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే ఎంఎంసీ పరిధిలో జరుగుతున్న ఈ మాన్యువల్ బోర్డుల దందాపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు మాన్యువల్ ఫామ్-1 కింద ఎన్ని దరఖాస్తులు స్వీకరించారు?వాటి ఆధారంగా ఎన్ని బోర్డులకు అనుమతులు రీ చేశారు? కార్పొరేషన్ ఖజానాకు ఎంత ఆదాయం సమకూరింది? కొందరు అధికారుల జేబుల్లోకి ఎంత వెళ్లింది? పారదర్శక ఆన్ లైన్ విధానాన్ని పకన పెట్టడానికి కారకులెవరు? అనే కోణంలో ఉన్నతాధికారులు దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపితే తప్ప ఈ అక్రమాల తీగ లాగితే కంతా కదిలే అవకాశం లేదు. నిబంధలు ఉల్లంఘించి మాన్యువల్ వసూళ్లకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

