పీర్జాదిగూడ, జనవరి 8 ;గిలోని చుక్కలన్నీ నేలపైకి వచ్చినట్లు.. ఒక్కో చుక్కను కలుపుతూ వేసిన ముగ్గులన్నీ ముత్యాల్లా మెరిసిపోయాయి. తీరొక్క రంగులతో కొలువైన ముగ్గుల్లో తెలంగాణ సంక్షేమ పథకాలన్నీ కొలువుదీరాయి. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి ఇన్ఫోప్రైడ్ మైదానంలో నిర్వహించిన మెగా ముగ్గుల పోటీకి 2500 మంది మహిళలు, యువతులు హాజరై ముగ్గులు వేయడంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు కల్పించారు.