హైదరాబాద్: హైదరాబాద్లో (Hawala Cash) పెద్దమొత్తంలో హవాలా డబ్బు పట్టుబడింది. డబ్బును అక్రమంగా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు రాయదుర్గం పీఎస్ పరిధిలో వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఓ ఇన్నోవా క్రిస్టా కారులో రూ.50 లక్షల నగదును గుర్తించారు. నగదుకు సంబంధించిన పత్రాలను చూపించకపోవడంతో సీజ్ చేశారు. అక్రమంగా డబ్బును తరలిస్తున్న విక్రమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు డబ్బును తరలిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.