e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home క్రైమ్‌ ‘25 లక్షలు గెలుచుకున్నారు’ అని మోసం

‘25 లక్షలు గెలుచుకున్నారు’ అని మోసం

  • మాయ మాటలతో.. బురిడీ
  • రకరకాల కారణాలు ఎరగా రూ.8 లక్షలు స్వాహా
  • నగరవాసిని బురిడీ కొట్టించిన సైబర్‌ దొంగలు

జీడిమెట్ల, జులై 24: సైబర్‌ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి ఓ గృ హిణి అక్షరాల ఎనిమిది లక్షలకు పైగా సొమ్మును సమర్పించుకుంది. వారు చెప్పిన మాటలకు ఆకర్షితురాలైన మహిళ అనాలోచిత వైఖరితో వారి ఉచ్చులో పడి మోసపోయింది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేష న్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు ప్రకారం, చింతల్‌ గణేష్‌నగర్‌కు చెందిన సూరిశెట్టి గాయత్రీదేవి(36)కి ఈనెల 9న విజ య్‌ కుమార్‌ అనే గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి మేడమ్‌ “కౌన్‌ బనే గా కరోర్‌పతి’ నుంచి మాట్లాడుతున్నామని, మీరు అదృష్టవంతులు మేడమ్‌, మా ప్రోగ్రామ్‌లో రూ.25 లక్షలు గెలుచుకున్నారని” ఆమెను నమ్మించాడు. ఈ-బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ ఇస్తే రూ.25లక్షలు పంపిస్తామని నమ్మబలికాడు. ఆమెకు అకౌంట్‌ నంబర్‌ లేకపోవడంతో తన స్నేహితురాలి బ్యాంక్‌ ఖాతా నెంబర్‌ వారికి ఇచ్చింది.

తిరిగి ఫోన్‌ చేసిన విజయ్‌ కుమార్‌ ముందుగా ప్రాసెసింగ్‌ ఫీజు రూ.2 లక్షలు చెల్లించాలని అడిగాడు. ఇది నమ్మిన ఆ మహిళ వెంటనే మీ సేవ కేంద్రం ద్వారా వారిచ్చిన బ్యాంక్‌ ఖాతాలో రూ.2లక్షలు జమ చేసింది. మళ్లీ ఈ నెల 15న సునీల్‌ మెహతా అనే వ్యక్తి సదరు మహిళకు ఫోన్‌ చేసి నేను ‘కౌన్‌ బనేగా కరోర్‌పతి’ ప్రోగ్రామ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ను అని పరిచయం చేసుకున్నాడు. డబ్బును మీ అకౌంట్‌లోకి పంపాలంటే రూ.75 వేలు చెల్లించాలని ఆమెను కోరాడు. అనంతరం, గృహిణి వారి ఖాతాకు రూ.75 వేలు పంపించింది. ఇదే అదను గా భావించిన సంబంధిత వ్యక్తి ఈ నెల 17న మహిళకు ఫోన్‌ చేసి మీరిచ్చిన అకౌంట్‌లో రూ.25 లక్షలు జమ చేశాము. కాని, అమౌంట్‌ ఫ్రీజ్‌ అయింది. మీరు తీసుకోవాలంటే రూ.లక్షా 25 వేలు పంపాలని కోరారు. దీనికి అంగీకరించిన సదరు మహిళ వారు చెప్పినట్లుగానే గూ గుల్‌ పే, పోన్‌ పేలకు డబ్బు పంపించింది. ఇదే విధంగా సదరు మహిళను ట్రాప్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు పలు దఫాలుగా మరో రూ.4లక్షల 18వేలు వేయించుకున్నారు. ఇలా ఆమె నుంచి మొత్తం రూ.8 లక్షల 18వేలు కాజేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana