అంగన్వాడీ ఏర్పాటు చేయండి
ఆ కాలనీలో ఉండే వాళ్లంతా పేద, మధ్య తరగతికి చెందిన వాళ్లే. మూడు వేలకు పైగా కుటుంబాలు, వెయ్యి మందికి పైగా చిన్నారులున్నారు. స్థానికంగా ప్రభుత్వ అంగన్వాడీ ఉంటే చిన్నారులు దూరం వెళ్లాల్సిన ఇబ్బందులు తీరుతాయనుకుంటున్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని
స్థలముంది.. భవనం నిర్మించాలి
పేమ్నగర్లో అంగన్వాడీ ఏర్పాటు కోసం స్థానికుల వినతి
కొండాపూర్, ఏప్రిల్ 5 : ఆ కాలనీలో ఉండే వాళ్లంతా పేద, మధ్య తరగతికి చెందిన వాళ్లే. మూడు వేలకు పైగా కుటుంబాలు, వెయ్యి మందికి పైగా చిన్నారులున్నారు. స్థానికంగా ప్రభుత్వ అంగన్వాడీ ఉంటే చిన్నారులు దూరం వెళ్లాల్సిన ఇబ్బందులు తీరుతాయనుకుంటున్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్‌నగర్ కాలనీలో అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో చిన్నారులు పక్క కాలనీకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. కాలనీ సంక్షేమం కోసం గతంలో కేటాయించిన ఖాళీ స్థలంలో అంగన్వాడీ పక్కా భవనాన్ని నిర్మిస్తే తమ చిన్నారుల ఇబ్బందులు తీరుతాయంటున్నారు కాలనీ వాసులు. అంగన్వాడీ సమస్యను స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు దృష్టి సారించి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కాలనీ వాసులు కోరుతున్నారు. భవనం నిర్మించే వరకు కాలనీలోని కమ్యూనిటీహాల్లో అంగన్వాడీ కేంద్రాన్ని కొనసాగించేలా చూడాలంటున్నారు.
కాలనీలో ఏర్పాటు చేయాలి
ప్రేమ్‌నగర్ కాలనీలో ఇప్పటికే 3 వేలకు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 1000 మందికి పైగా చిన్న పిల్లలున్నారు. కాలనీ సంక్షేమం కోసం గతంలో కేటాయించిన ఖాళీ స్థలంలో అంగన్వాడీ భవనాన్ని నిర్మిస్తే పిల్లలు వేరే కాలనీలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంగన్వాడీ ఏర్పాటుపై స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సానుకూల ధృక్పథంతోనే ఉన్నారు.
– రూపారెడ్డి, ప్రేమ్‌నగర్
ఉన్నతాధికారులతో చర్చిస్తా
కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో పేద, మధ్య తరగతి కుటుంబాలు అధిక సంఖ్యలో నివాసం ఉంటున్నాయి. కాలనీలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు ఉన్నత అధికారులు, స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి ఏర్పాటు చేసేలా కృషి చేస్తా.
– హమీద్ పటేల్, కొండాపూర్ కార్పొరేటర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

