ఐటీ కారిడార్‌లో కొత్తగా ఐదు లింకు రోడ్లు..

రూ. 72 కోట్లతో ప్రతిపాదనలు
త్వరలో టెండర్లు.. పనులు
సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని నగరవాసుల ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న లింకు రోడ్ల నిర్మా ణం సత్ఫలితాలనిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నగరంలోనే అత్యధికంగా రద్దీగా ఉంటే ఐటీ కారిడార్‌లో ఐదు చోట్ల ఈ తరహా రహదారులను నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ల్యాంకోహిల్స్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగు రోడ్డు వరకు, పుప్పాలగూడ, పరిసర ముఖ్య ప్రాంతాలను అనుసంధానిస్తూ.. .2.35 కిలోమీటర్ల మేర రెండు లింకు రోడ్లు, ఓఆర్ఆర్ నుంచి విప్రో జంక్షన్ -ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐఎస్బీ రోడ్డు వరకు 2.25 కి.మీ, ల్యాంకోహిల్స్ నుంచి అనన్వ కన్వెన్షన్, హైటెక్‌సిటీ హ్యుండ య్ షోరూం పక్క నుంచి ఎన్ఏసీ బ్యాక్ గేటు వరకు, అటు నుంచి కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి అనుసంధానం చేస్తూ రోడ్లు నిర్మించాలని ప్రతిపాదించారు.
వీటికి రూ. 72 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇటీవల పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ అధికారులతో కలిసి సాధ్యాసాధ్యా లను పరిశీలించారు. త్వరలో భూసేకరణ..పనులకు టెండర్లు ఆహ్వానించనున్నామని అధికారులు వెల్లడించారు. ఈ లింకు రోడ్లు పూర్తయితే.. పలు ప్రాంతాల మధ్య దూరం తగ్గి ప్రయాణం మరింత చేరువ కానున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

