గ్రేటర్లో ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణ దూరం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికబద్దంగా రహదారులను అభివృద్ధి చేస్తున్నది. 133 లింకు రోడ్ల నిర్మాణ పనుల్లో రెండవ విడతలో రూ.232.62 కోట్ల వ్యయంతో కొత్తగా 13 చోట్ల లింకు రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
శివారు ప్రాంతాల్లో పట్టణీకరణకు లింకు రోడ్లు ఎంతో అనుకూలంగా మారుతున్నాయి. భవిష్యత్తు అవసరాలను గుర్తించి విశాలమైన రోడ్లను నిర్మిస్తుండటంతో ఎంతటి ట్రాఫిక్ రద్దీనైనా తట్టుకునేలా ఈ లింకు రోడ్లు వస్తున్నాయి. సిటీ లోపల నుంచి అనుసంధానమే కాకుండా బయట ప్రాంతాలకు చేరుకునేందుకు ఈ లింకు రోడ్లన్నీ ఎంతో దోహదపడుతున్నాయి. మెట్రో నగరాల్లోనే ఈ లింకు రోడ్లు సరికొత్త పట్టణ ప్రణాళిక. ఈ లింకు రోడ్ల నిర్మాణానికి కృషి చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – జీవీ రావు, అధ్యక్షుడు టీడీఏ