వేలాది కోట్లతో నియోజకవర్గం అభివృద్ధి
ఎల్బీనగర్ నియోకవర్గం ప్రజలు పిలిస్తే పలికే నాయకుడిని , అభివృద్ధి చేసే నేతను గెలిపించాలని ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కోరారు.
- ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
ఎల్బీనగర్, నవంబర్ 2 : ఎల్బీనగర్ నియోకవర్గం ప్రజలు పిలిస్తే పలికే నాయకుడిని , అభివృద్ధి చేసే నేతను గెలిపించాలని ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగోలు సాయినగర్ సీనియర్ సిటీజన్స్ ఆత్మీయ సమ్మేళనం, యెగ్గె మల్లేశం గార్డెన్స్‌లో బీసీ ఉప కులాల ఐక్యవేదిక ఆత్మీయ సమ్మేళనం, జైపురి కాలనీ బస్తీ వాసుల ఆత్మీయ సమ్మేళనం, ఎల్బీనగర్ నియోజకవర్గం సెవెన్ సీటర్స్ ఆటో యూనియన్ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం, హస్తినాపురం శ్రీ బాలాజీ వెల్పేర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనాల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పాల్గొని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని వేలాదికోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి స్థిరపడిన వారికి అండగా ఉంటామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు అనంతుల రాజారెడ్డి, మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, రమావత్ పద్మానాయక్, డివిజన్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, గజ్జల మధుసూదన్‌రెడ్డి, చెన్నగోని శ్రీధర్ గౌడ్, సత్యం చారి, శ్యామల యాదగిరి వంశరాజ్, రాసమల్ల శ్రీనివాస్, సుర్వీరాజు, సతీశ్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, ఆదిలక్ష్మి, పల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

