LB Nagar ACP | అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్యపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. కొంతకాలంగా ఆయన వ్యవహారశైలిపై పలు ఆరోపణలు రావడంతో శాఖాపరమైన చర్యలకు అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది.
కృష్ణయ్యను సస్పెండ్ చేసేందుకు గతంలోనే అధికారులు చర్యలు ప్రారంభించారు. అయితే ఆ సమయంలో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కృష్ణయ్య తిరిగి విధుల్లో చేరారు.
విధుల్లో చేరిన కొద్దికాలానికే ఆయనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణయ్యపై వచ్చిన ఆరోపణలు, సస్పెన్షన్కు దారితీసిన కారణాలపై అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది.