Manne Krishank | కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లు కూల్చే కుట్ర చేస్తోంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అంబేద్కర్ హట్స్ పరిధిలో 40 ఏళ్లుగా నివసిస్తున్న 650 కుటుంబాల గుడిసెలను బుల్డోజర్లతో కూల్చే యత్నం చేయడంతో బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ బుల్డోజర్కు అడ్డంగా వెళ్లి పేదల ఇండ్లు కూల్చకుండా అడ్డుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కట్టిస్తామని చెప్పి ఉన్న గుడిసెలు కూల్చివేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలని అధికారులను నిలదీశారు.
ఈ సందర్భంగా మన్నె క్రిశాంక్ అక్కడి పేదలు, బస్తీ వాసులతో మాట్లాడుతూ.. బోయిన్‌పల్లిలో 8 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ 6 వేల మందికి ఇందిరమ్మ ఇండ్లు కడతామని చెప్పిర్రు. ఇప్పుడు ఆ జాగను కూడా ప్రైవేట్ వాళ్లు వచ్చి తీసుకున్నరు. ప్రభుత్వ భూమి అక్కడ రేపటి రోజున 6 వేల ఇండ్లు కడతారంటే మనకు వస్తయి కావొచ్చని మీరు అనుకుంటరు. ఇప్పుడు ఆ జాగ కూడా లేదు. ప్రైవేట్ వాళ్లు వచ్చి 100 మంది గూండాలను పెట్టి అక్కడ హద్దులు పెట్టేసుకున్నరు. 10 రోజులైతే ఎమ్మెల్యే ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
మీ గుడిసెలు కూల్చేసిన తర్వాత ఆ ఇండ్లు ఒక్క సంవత్సరం కడ్తరా.. రెండేళ్లు కడతరా.. ఆయన మళ్లీ ప్రభుత్వంలోకి వస్తడా దేవుడెరుగు. అప్పుడు మీరెక్కడ బతుకతరో తెల్వదు. రేపు మీరు ఆఫీసుల చుట్టూ తిరిగితే చూస్తం.. చేస్తమని 15 రోజులు పోతది. మీ అందరికీ ఓటర్ ఐడీలున్నయ్ కదా.. మనమంతా కోర్టుకు పోదాం.. వచ్చే దారిలోనే కేటీఆర్‌తో మాట్లాడిన. మీకు రూపాయి ఖర్చు కాకుండా మేం చూసుకుంటమని మన్నె క్రిశాంక్ భరోసా ఇచ్చారు. ఇక్కడ అన్నిపార్టీలకు ఓట్లేసినోళ్లున్నరు. కానీ రాత్రికి రాత్రే వచ్చి మీరంతా ఖాళీ చేయండంటే యాడికి పోవాలి అందరూ అని మన్నెక్రిశాంక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ ఇండ్ల కోసం నేను న్యాయపోరాటం చేస్తానని పేదలు, బస్తీ వాసులకి హామీనిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై న్యాయపరంగా పోరాడి, తమకు అండగా ఉంటానని బాధితులకు కేటిఆర్ హామీనిచ్చినట్టు మన్నె క్రిశాంక్ తెలిపారు.
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ ఇండ్ల కోసం నేను న్యాయపోరాటం చేస్తాను
కాంగ్రెస్ ప్రభుత్వంపై న్యాయపరంగా పోరాడి, తమకు అండగా ఉంటానని బాధితులకు కేటిఆర్ హామీ
కంటోన్మెంట్ నియోజకవర్గంలో పేదల ఇండ్లు కూల్చే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అంబేద్కర్ హట్స్… https://t.co/QyzhoSp7tV pic.twitter.com/oaANAXvnZN
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2026