కొత్తూరులో కొత్త ట్రాన్స్ఫార్మర్!.. వ్యవసాయ విద్యుత్‌ను రైతులే వాడాలంటూ అధికారుల ఆదేశం
వ్యవసాయ అవసరాల కోసం మంజూరైన విద్యుత్ కనెక్షన్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్న వైనంపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనంతో ఎస్పీడీసీఎల్ అధికారులు కదిలారు.
- పరిశ్రమకు వాడుతున్న సరఫరా డీటీఆర్ నుంచి తొలగింపు
సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కొత్తూరులో వ్యవసాయానికి ఉద్దేశించిన విద్యుత్‌ను పారిశ్రామిక అవసరాలకు వాడుతున్నారంటూ రైతులు స్వయంగా చిత్రీకరించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఒక పరిశ్రమతో పాటు మూడుహోటళ్లకు సంబంధించిన యజమానులు తమ వ్యాపారాలకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను, అందుకు సంబంధించిన పీటీఆర్పై లోడు పడేలా కరెంట్ వినియోగం చేస్తుండడంతో రైతులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ట్రాన్స్ఫార్మర్పై అధికలోడ్‌తో తరచుగా రిపేర్లకు రావడంతో రైతులకు వ్యవసాయ పనులకు చాలా ఇబ్బంది తలెత్తింది. ఈ మొత్తం విషయాన్ని నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో కందుకూరుకు సంబంధించిన విద్యుత్ అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మామిడిపల్లి ఏడీఈ ఆ ప్రాంతానికి వచ్చి పరిస్థితిని సమీక్షించి పరిశ్రమకు వాడుతున్న కరెంటును కమర్షియల్‌గా మార్చడంతో పాటు కొత్తూరు ఎక్స్ రోడ్డులో 100కేవీఏ ట్రాన్స్ఫార్మర్ను 160కేవీఏగా మారుస్తూ కొత్తది ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా పరిశ్రమకు సరఫరా అవుతు న్న కరెంట్‌ను ఈ డీటీఆర్నుంచి తొలగించామని విద్యు త్ అధికారులు తెలిపారు. తమ సమస్యను వెలుగులోకి తెచ్చి పరిష్కారమయ్యేలా చేసిన నమస్తే తెలంగాణకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమలు కానీ వ్యా పా ర వాణిజ్య సంస్థలు వ్యవసాయం కోసం కేటాయించిన విద్యుత్‌ను వినియోగించవద్దని, కమర్షియల్ కేటగిరీలో కరెంట్‌ను వాడాలని అధికారులు చెప్పి ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని స్థానిక సిబ్బందికి, ప్రజలకు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

