తెలంగాణ గుజరాతీల కోసం ‘గుజరాతి ఏక్తా మహోత్సవం జెమ్-24’ జనవరి 7 నుంచి ఏప్రిల్ 21 వరకు కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ‘జెమ్ – 24’ గ్రాండ్ ఫైనల్ కోసం కిడ్స్ ఫ్యాషన్ షోను ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో 200 మంది పిల్లలు ఆడిషన్లో భాగస్వామ్యం పంచుకున్నారు. ఫ్యాషన్ షో ప్రదర్శన సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి రోడ్ గుజరాతి స్కూల్లో జరిగింది. ఇవే కాకుండా తెలంగాణలోని గుజరాతీల అందరి కోసం ఒక భారీ ఈవెంట్ ‘గుజరాతీ ఏక్తా మహోత్సవ్’ నిర్వహించడం జరుగుతున్నది.
ఇందులో క్రీడలు, సంస్కృతి, ప్రతిభ, అందాల పోటీలు, కిడ్స్ ఫ్యాషన్ షో, ఇంకా మరెన్నో ఆసక్తికరమైన ఈవెంట్లను ఈ గ్రాండ్ ఫినాలేలో నిర్వహిస్తున్నారు. పిల్లలు ఐదేండ్ల నుంచి పదేండ్లకు పైన ఉన్న పిల్లలు ఈ ఈవెంట్లలో భాగస్తులు అవుతున్నారు. పిల్లలు సంప్రదాయ, సమకాలీన దుస్తువులను ప్రదర్శిస్తూ ర్యాంప్‌పై సందడి చేశారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గుజరాత్ సమాజ్ ఏప్రిల్ వరకు నిర్వహిస్తున్నది. పెద్దలకు, మహిళలకు క్రికెట్, బ్యాడ్మింటన్, చెస్, మిస్ & మిసెస్ తెలంగాణ గుజరాతీ, నృత్యాలు, తదితరాలను ‘గుజరాతి ఏక్తా మహోత్సవ్’లో చేపడుతున్నారు.
– సిటీ డెస్క్ సేకరణ