కేసీఆర్ చేసిన అభివృద్ధే సునీతను గెలిపిస్తుంది
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అభివృద్ధే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ విజయానికి నాంది అవుతుందని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి అన్నారు.
- ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి
వెంగళరావునగర్, అక్టోబర్ 22: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన అభివృద్ధే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ విజయానికి నాంది అవుతుందని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి అన్నారు. బుధవారం సోమాజిగూడ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి , జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీ విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి మాగంటి సునీతా గోపీనాథ్‌ను ఓటర్లు గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం తథ్యమని పేర్కొన్నారు. పేదలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మాగంటి సునీతను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు హేమ, శ్యామల, మహేష్‌యాదవ్, శైజన్, శేఖర్, దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్, బూత్ ఇన్చార్జిలు, కోఆర్డినేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

