Bigg Boss 7 | బిగ్బాస్ 7 ఫినాలే సందర్భంగా జరిగిన విధ్వంసం కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న 24 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేయగా.. తాజాగా బిగ్బాస్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఆస్తుల ధ్వంసం, అల్లర్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. బిగ్బాస్ షోను ఎండెమోల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఆ సంస్థకే తాజాగా మాదాపూర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.