విశ్రాంత ఐపీఎస్ సతీమణి హత్య కేసులో ట్విస్ట్
జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్ సతీమణి భార్య తనూజ రంజన్ హత్య కేసులో నింది తుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు మాత్రమే పాల్గొన్నారని ముందుగా భావించారు. తాజా గా పోలీసుల విచారణలో భాగంగా మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించారు.
- చోరీ సొత్తు పంచుకుని సరిహద్దు దాటిన ముగ్గురు
- నేపాలీ గ్యాంగ్ సభ్యుడి అరెస్ట్
బంజారాహిల్స్,మే 21: జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్ సతీమణి భార్య తనూజ రంజన్ హత్య కేసులో నింది తుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు మాత్రమే పాల్గొన్నారని ముందుగా భావించారు. తాజా గా పోలీసుల విచారణలో భాగంగా మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించారు. చోరీ గ్యాంగ్‌లో సభ్యుడైన సునీల్ పర్యార్‌ను గురువారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సునీల్ పర్యార్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మే 8న తనూజ రంజన్ ఇంట్లో చోరీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్‌లో కల్పనతో పాటు సురేష్ షాహీ అలియాస్ సృజన్ షాహీ, గణేష్ బికా, కందాలామా, నేత్ర షాహీ, సునీల్ పర్యార్, గణేష్ షాషీ అనే వ్యక్తులున్నారని తేలింది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం నేరుగా రైల్లో కాజీపేట వెళ్లి అక్కడనుంచి ముంబయికి చేరుకున్న నేపాలీ గ్యాంగ్ సభ్యులు అక్కడే చోరీ సొత్తును పంచుకున్నట్లు తేలింది. అక్కడినుంచి ఎవరికి వారు వేర్వేరు మార్గాల్లో పారిపోయినట్లు తేలింది. కాగా ముంబయికి చేరుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేయగా సునీల్ పర్యార్ మాత్రమే చిక్కాడు. అతడు దిలీప్ బహుదూర్ అనే వ్యక్తికి బంగారం విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సునీ ల్ పర్యార్‌ను రిమాండ్‌కు తరలించారు.
నేపాల్ సరిహద్దులు దాటిన నిందితులు..
ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్‌లో తనూ జ రంజన్‌ను హత్య చేసిన అనంతరం వారిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు ప్రత్యేక బృందాలు అదే రోజున రంగంలోకి దిగాయి. నాలు గు బృందాలు ఉత్తర్‌ప్రదేశ్‌లోని నేపాల్ సరిహద్దులో మొహరించాయి. అయితే నేపాల్‌కు, భారత్‌కు మద్యన సుమారు 1700 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉండడంతో పాటు దాదాపు 400దాకా చెక్‌పోస్ట్‌లు ఉండడంతో నేపాలీ గ్యాంగ్‌లోని ముగ్గురు నిందితులు సరిహద్దులు దాటినట్లు పోలీసులు గుర్తించారు. దౌత్యమార్గంలో నేరస్థులను పట్టుకోవడం ఒక్కటే ప్రస్తుతం పోలీసుల ముందున్న మార్గం గా కనిపిస్తోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

