బంజారాహిల్స్, అక్టోబర్ 10: మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నాన్ లోకల్ అంటూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. తాజాగా ఓ సోషల్ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవీన్ యాదవ్ మరో అడుగు ముందుకు వేసి సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కే విజయరామారావు సైతం నాన్ లోకల్ అంటూ వ్యాఖ్యలు చేయడం మరో వివాదాన్ని సృష్టించింది.
సీబీఐ మాజీ డైరెక్టర్‌గా పనిచేసిన విజయరామారావు 1999లో ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నాన్ లోకల్ అంటూ చేసిన కామెంట్స్ మరోసారి చిచ్చుపెట్టాయి.