పట్టపగలే.. దోచేశారు
పట్టపగలే బంగారు ఆభరణాల దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. దుండగులు కత్తితో బెదిరించి.. గాయపరిచి..సొత్తు దోచుకొని పారిపోయారు.
- కత్తుతో బెదిరించి..గాయపరిచి..
- బంగారు నగల దుకాణంలో దోపిడీ
- 150 గ్రాముల ఆభరణాలతో ఉడాయింపు
చాదర్‌ఘాట్, ఫిబ్రవరి 14: పట్టపగలే బంగారు ఆభరణాల దుకాణంలో భారీ దోపిడీ జరిగింది. దుండగులు కత్తితో బెదిరించి.. గాయపరిచి..సొత్తు దోచుకొని పారిపోయారు. చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ ప్రకాశ్‌రెడ్డి, బాధితుల కథనం ప్రకారం…. అక్బర్‌బాగ్ చౌరస్తాలోని కిష్వా జ్యూవెల్లర్స్ దుకాణంలో బుధవారం యజమాని మహ్మద్ ఉల్ రహమాన్ తన కుమారుడు సజావల్ రహమాన్‌ను దుకాణంలో ఉంచి.. భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మాస్క్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి దుకాణానికి వచ్చి.. బంగారు గొలుసు కావాలని అడిగాడు.
సజావల్ రహమాన్ గొలుసు చూపిస్తుండగా, అతడు ఒక్కసారిగా కత్తితో గాయపరిచాడు. అంతలోనే మాస్క్.. హెల్మెట్ ధరించిన మరో ఇద్దరు వ్యక్తులు దుకాణంలోకి చొరబడ్డారు. 150 గ్రాముల ఆభరణాలను దోచుకొని నిందితులు పారిపాయారు.
ఘటనాస్థలికి సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ జానకీ, మలక్‌పేట ఏసీపీ శ్యామ్‌సుందర్, చాదర్‌ఘాట్ ఇన్స్పెక్టర్ ప్రకాశ్‌రెడ్డి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీంతో ఆధారాలను సేకరించారు. నిందితులు నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చినట్లు గుర్తించారు. గాయపడిన సజావుల్ రహమాన్‌ను దవాఖానకు తరలించారు. నిందితులను పట్టుకునేందుకు ఎనిమిది బృందాలు గాలిస్తున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

