భానుడి అరుణవర్ణ కాంతులకు తోడు జిగేల్మనే ఐటీ కారిడార్ వెలుగుల్లో... చల్లని గాలులు వీస్తున్న వేళ... దుర్గం చెరువులో పర్యాటకులకు బోటులో షికారు మనసుకు ఎంతో హాయి కల్పిస్తున్నది. ఆ వెనుకే ఎగిసిపడే అలలు పర్యాటకుల హృదయ స్పందనలకు ప్రతిబింబాలుగా నిలిచాయి.