మాదాపూర్, ఆగస్టు 6: ముద్దులొలికే.. ముచ్చటగొలిపే.. బుడిబుడి నడకలతో ఇండియా కిడ్స్ ఫ్యాషన్ షో అదుర్స్ అనిపించింది. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్ 10వ ఎడిషన్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. సంప్రదాయ దుస్తులను ధరించిన చిన్నారులు రా్ంయప్పై క్యాట్ వాక్ చేస్తూ అలరించారు. ఆర్య, అన్య, డాక్టర్ రాజేశ్వరీ, త్రిషా, చారు సింఘాల్ చేతుల మీదుగా రూపొందించబడిన బ్రాండ్లు, షో కేస్ ఉత్పత్తులతో పాటు మరెన్నో అద్భుతమైన కలెక్షన్లను ప్రదర్శించారు. 8 మంది డిజైనర్లు తమ బ్రాండ్లను ప్రదర్శించగా 350 మంది చిన్నారులు డిజైనర్లు రూపొందించిన దుస్తులను ధరించి ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేస్తూ అలరించారు.