చిన్నారులు బుడిబుడి అడుగుల నడకలతో ర్యాంప్‌పై తళుక్కుమన్నారు. మోడళ్లను తీసిపోని విధంగా క్యాట్‌వాక్‌లతో వీక్షకులను కనువిందు చేశారు. గచ్చిబౌలిలోని ‘ది లే మెరీడియన్’లో ఆదివారం జూనియర్స్ ఫ్యాషన్ వీక్ ఆధ్వర్యంలో 74వ ఎడిషన్ ష్యాషన్ షో జరిగింది. ఈ షోలో నాలుగేండ్ల నుంచి 12 ఏండ్ల చిన్నారులు పాల్గొని సందడి చేశారు. ‘ఎథినిక్, ఫ్లోరల్, వెస్ట్రన్, ఇండో వెస్ట్రన్’ కలెక్షన్ దుస్తుల్లో వాక్ చేస్తూ అదరహో అనిపించారు. విమ్సీ బ్యూటీ, ఇండియన్ టెర్రైన్ బాయ్ ఏంజెల్ అండ్ రాకెట్ వంటి అంతర్జాతీయ కలెక్షన్లతో 150 మంది జూనియర్లు ఈ షోలో అలరించారు.
– సిటీబ్యూరో, జూలై 16