అక్రమ నల్లా కనెక్షన్లపై ఉక్కుపాదం

- యజమానులు, సహకరించిన సిబ్బందిపై క్రిమినల్ కేసులు
- హడలెత్తిస్తున్న జలమండలి విజిలెన్స్ అధికారులు
అక్రమ నల్లా కనెక్షన్లపై జల మండలి ఉక్కుపాదం మోపుతుంది. వరుస తనిఖీలు చేస్తూ తాగునీటి చౌర్యానికి పాల్పడుతున్న వ్యక్తులపై, అందుకు సహకరించిన జలమండలి సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నది. దీంతో ఒకవైపు అక్రమ నల్లా కనెక్షన్లు చేపట్టిన యజమానులతోపాటు ఔట్ సోర్సింగ్ సిబ్బంది వెన్నులో వణుకుపుడుతున్నది.
సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): తాగునీటి చౌర్యానికి పాల్పడుతున్న వారిపై జలమండలి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ సూచనలు, జలమండలి ఎండీ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు వరుస తనిఖీలు చేపడుతున్నారు. తాగునీటిని చౌర్యం చేస్తున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు అందుకు సహకరించిన జలమండలి ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేసి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నది. నాలుగైదు రోజుల్లోనే సుమారు 7-8 ప్రాంతాల్లో అక్రమ కనెక్షన్లను గుర్తించి వాటిని తొలగించామని జలమండలి విజిలెన్స్ అధికారులు తెలిపారు. జలమండలి తాగునీరు సరఫరా చేస్తున్న అన్ని ప్రాంతాల్లో విజిలెన్స్ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
సమాచారం ఇవ్వండి…
అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నల్లా కనెక్షన్లు పొందిన వారు, డొమెస్టిక్ కనెక్షన్‌ను తీసుకొని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వ్యక్తులు మీ సమీపంలో ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని జలమండలి విజిలెన్స్ విభాగం అధికారులు కోరుతున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, సమాచారం ఇవ్వాలనుకునే వారు 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకున్న వ్యక్తులను గుర్తించి క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ముగ్గురిపై క్రిమినల్ కేసులు..
- అక్రమ నల్లా కనెక్షన్లకు సహకరించిన సుమారు ఆరుగురు ఔట్సోర్సింగ్ సిబ్బందిపై మంగళవారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తాజాగా అక్రమ కనెక్షన్లను పొందిన ముగ్గురు ఇంటి యజమానులపై జలమండలి విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు.
- ఐడీపీఎల్ సమీపంలోని నందానగర్ ఇంటి నెంబర్ 30-005/2లో నివసిస్తున్న ఎండీ మొయీన్, గాంధీనగర్ సమీపంలోని ఇంటి నెంబర్ 27-39లో నివాసం ఉంటున్న బి.రాజేశ్ అనే వ్యక్తులు అక్రమంగా నల్లా కనెక్షన్‌ను పొందారు. జలమండలి విజిలెన్స్ అధికారుల తనిఖీలో ఈ విషయం బట్టబయలు కావడంతో మొయీన్, రాజేశ్‌లపై జీడిమెట్ల పోలీసు స్టేషన్ల పరిధిలో పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
- కూకట్‌పల్లిలోని పాపిరెడ్డి నగర్ ప్లాట్ నెంబర్ సీ28లో నివాసం ఉంటున్న కె.నర్సింహులు నల్లా కనెక్షన్‌ను గతంలో అధికారులు తొలగించారు. అక్రమంగా మళ్లీ నల్లా కనెక్షన్‌ను ఏర్పాటు చేసుకొని తాగునీటి చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించిన అధికారులు నర్సింహులుపై కూకట్పల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

