Harish Rao | తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తు పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్లు అగ్రిమెంట్ ఉందన్నవ్ కదా.. దమ్ముంటే ఒకవేళ అగ్రిమెంట్ ఉంటే బయటపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సవాలు విసిరారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుమ్మిడిహట్టి విషయంలో అగ్రిమెంట్ బైట పెడితే నేను రాజీనామాకి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
అగ్రిమెంట్ లేకుంటే రాజకీయాల కోసం అబద్దం మాట్లాడిన అని తప్పయిందని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తుమ్మిడిహట్టి నిర్మిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పారు. కాంగ్రెస్ వచ్చి రెండున్నర సంవత్సరాలు అయింది. వీళ్ల మానిఫెస్టోలో తుమ్మిడి హట్టి కడతం అన్నరు. అయితే రెండున్నరేళ్లలో ఒక్కసారి కూడా మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇస్తలేడా..? లేదా డ్రామాలు ఆడుతున్నారా..? అని మండిపడ్డారు.
10 రోజులకే వెళ్లి కలిశా..
ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే నేను నెలలోపు వెళ్లి కలిసిన. కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిస్తే ప్రభుత్వం వచ్చిన 10 రోజులకే వెళ్లి కలిశానని హరీశ్ రావు అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో రెండు రోజులు ఉండి వెయిట్ చేసి ముఖ్యమంత్రి ఎప్పుడు టైమిస్తే అప్పటిదాకా నేను ఇక్కడనే ఉంటానని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిమిలాడి వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు.. మా ఇంజినీర్లు పోయిర్రు. నేను మూడు నాలుగు సార్లు పోయిన. మరి మీరు రెండున్నర సంవత్సరాల్లో మీరు పోయింది కూడా లేదు.. అంటే మీది డ్రామా కంపెనీ.
రెండున్నరేళ్లలో మీరు కనీసం తుమ్మడిహట్టి కోసం ఒక్కసారైనా మహారాష్ట్రకు పోయిర్రా.. రెండు సంవత్సరాల 7 నెలలు పూర్తయింది.. అది మీ కమిట్మెంట్కు నిదర్శనం.. మా నిజాయితీ ఇది. మేం గవర్నమెంట్ వచ్చినకొత్తలోనే పోయినం. మరి మీరు ఈ రెండు సంవత్సరాల 7 నెలలు ఎందుకు పోలేదు. ఏం చేసిర్రని ప్రశ్నించారు. మాకు ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే అపాయింట్మెంట్ ఇచ్చాడు.. మీరు కనీసం ప్రయత్నమైనా చేస్తున్నారా..? అని అడిగారు.
బ్రేకింగ్ న్యూస్
తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తు పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్లు అగ్రిమెంట్ ఉంటే బయటపెట్టు
అగ్రిమెంట్ బైట పెడితే నేను రాజీనామాకి సిద్ధం
అగ్రిమెంట్ లేకుంటే తప్పయిందని క్షమాపణలు చెప్పు
తుమ్మిడిహట్టి నిర్మిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పారు… https://t.co/5n2RDs1Q0v pic.twitter.com/JTx01YGZeo
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2026