కవాడిగూడ, నవంబర్ 13: భక్తిభావనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నా రు. కార్తికమాసం, ముషీరాబాద్ ముదిరాజ్ సంఘం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ముషీరాబాద్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం భోలక్‌పూర్ డివిజన్ దేవునితోటలోని శ్రీ భవానీశంకర్ దేవాలయంలో ముషీరాబాద్ నియోజక వర్గంలోని ముదిరాజ్ సంఘం మహిళలు పెద్ద ఎత్తున హాజరై సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, ముదిరాజ్ సంఘం చైర్మన్ డి. శివ ముదిరాజ్, సదాలు హాజరై పూజలు చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన వనభోజనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముదిరాజ్‌లు ఐక్యంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముదిరాజ్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గోపాల్, ముఠా జయసింహలను సత్కరించా రు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ముఖ్య సలహాదారు వీరేశం, ప్రధాన కార్యదర్శి తరుణ్‌రాజ్, కోశాధికారి కృష్ణ, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, నాయకులు ముత్యాలు, మరళీమోహన్, వెంకటేశ్, తిలక్‌రాజ్ పాల్గొన్నారు.
డివిజన్ సత్యానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తిక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక కమ్యూనిటీహాల్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతమహోత్సవాలు ఘనంగా జరిగాయి. కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని సత్యనారాయణస్మామి వ్రతాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు యాదగిరి, దశరథరావు, ప్రసాద్, అనూష, శివశంకర్, భాగ్యలక్ష్మి, సుమన్, రవీందర్, ఈశ్వర్, టీఆర్ఎస్ సీనియర్ నేత సురేందర్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.