రూ.కోటి 30లక్షలు కేటాయింపు
పీర్జాదిగూడ, నవంబర్ 13: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలోని కాలనీల్లోని దెబ్బతిన్న ప్రధానరోడ్లు, అంతర్గతరోడ్ల మరమ్మతుల కోసం కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక కార్పొరేటర్ల సూచనల మేరకు బడ్జెట్ సమావేశంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. ఇందుకుగాను మరమ్మతులకు రూ. కోటి 50 లక్షలు నిధులు కేటాయించారు. ప్రతి డివిజన్‌కు రూ. 5లక్షల చొప్పున కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే పలు డివిజన్లలో రోడ్ల మరమ్మతులు ప్రారంభించారు. సాయి ఐశ్వర్య కాలనీ నుంచి సాయిప్రియ కాలనీకి వెళ్లే ప్రధానరోడ్డులో గుంతల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతంలో క్రమపద్ధ్దతిలో రోడ్డు కటింగ్‌లు చేసి బీటీ, సీసీ మెటీరియల్‌ను నింపి మరమ్మతుల చేస్తున్నారు. కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణలో ప్రతి డివిజన్లలో గుంతల రోడ్లును గుర్తించి మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై భారీ గుంతల ఏర్పడ్డాయి. వాటి మరమ్మతులకు చర్యలు చేపట్టాం. ప్రజలకు ఇబ్బందులు పడకుండా డివిజన్ల వారీగా దెబ్బతిన్న రోడ్లను గుర్తించి రోడ్డు కట్టంగ్ చేపట్టి వాటిలో బీటీ వేసి బాగు చేస్తాం.ప్రతి డివిజన్లో రోడ్డు ప్యాచ్‌వర్క్ పనులను చేపెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.
-కార్పొరేషన్ డీఈ శ్రీనివాస్