బడంగ్‌పేట, నవంబర్13: బ్రాహ్మణుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాశిబుగ్గ దేవాలయంలో బడంగ్‌పేట బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తిక సమారాధన సభ నిర్వహించారు. ఈ సందర్భరంగా మంత్రి మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బ్రాహ్మణ భవనం ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకుంటామని తెలిపారు.
బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేణుగోపాల చారి, ఎమ్మెల్సీ వాణీదేవి, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మేయర్ పారిజాత, మహేశ్వరం నియోజక వర్గం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ, బ్రాహ్మణ సంఘాల నాయకులు హన్మంత చారి, రాఘవ రావు విరాట్, స్వరూప్ పాల్గొన్నారు.