మూసాపేట, నవంబర్13: అత్యధిక మురికివాడలు కలిగిన మూసాపేట డివిజన్‌ను సమస్యల రహిత డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మురుకివాడల్లో ప్రధాన సమస్యగా మారిన డ్రైనేజీ, మంచినీరు, రోడ్లు తదితర సమస్యలు పరిష్కారం కావడంతో స్థానిక కాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూసాపేట డివిజన్ పరిధిలోని అవంతినగర్తోటలో అధికారులు ఇటీవల రూ.18 లక్షల వ్యయం తో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు.
దీంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాలనీ లో అంతర్గత రహదారులు నిర్మించాలని అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలోని సమస్యలను మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ దృషికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు పరిష్కారించినందుకు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారంటూ కాలనీవాసులు పేర్కొన్నారు.
మూసాపేట డివిజన్ పరిధిలో ఉన్న బస్తీల్లో, కాలనీల్లో ఉన్న రోడ్లన్ని సీసీ రోడ్లగా మారుస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాం. డివిజన్ సమగ్రాభివృద్ధి కోసం పదవిలో ఉన్నా లేకున్నా నిరంతరం కృష చేస్తూ డివిజన్లోని ప్రతి కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టాం. సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, తాగునీటి పైప్లైన్ల నిర్మాణం వంటి అభివృద్ధి పను లు చేశాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే డివిజన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ ద్వారా నిధులు మం జూరు అయ్యేవిధంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎంతో కృషి చేశారు.
– తూము శ్రావణ్‌కుమార్,మాజీ కార్పొరేటర్