బాలానగర్, నవంబర్ 13 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధి శంకర్ఎన్క్లేవ్లో డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్‌తో కలిసి రూ.1 కోటి 30 లక్షల నిధులతో సీసీరోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూకట్పల్లి నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి కృషి చేస్తూ.. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గం ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం లో నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ల సహకారంతో కూకట్పల్లి నియోజవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో రాజీపడే ప్రసక్తే లేదని… ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ రంగంలో కూకట్పల్లి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు.
నియోజకవ్గంలో ఇప్పటికే ప్రజల సౌకర్యార్థం ైప్లెఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్‌యూబీలు, ఆర్వోబీలు, ఎస్టీపీలు, జిమ్‌లు, ఓపెన్‌జిమ్‌లు, పార్క్‌లు, ఆటస్థలాల అభివృద్ధి, షటిల్ కోర్టులు, తాగునీటి రిజర్వాయర్లు నిర్మించి మెరుగైన సేవలందించినట్లు వెల్లడించారు. కూకట్పల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి చేయాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరం అన్నారు. అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు అందజేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు చేరువైందన్నా రు.
అనంతరం కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్లో ఇప్పటికే చాలా వర కు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేశామన్నారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్‌ను మరింత అభివృద్ధి చేయడం కోసం నిరంతరాయంగా కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నరేందర్‌గౌడ్, బల్వంత్‌రెడ్డి, కర్రె జంగయ్య, మక్కల నర్సింగ్, ఇర్ఫాన్, హరినాథ్, బుర్రి యాదగిరి, ఉదయ్, పిట్ల రాజు ముదిరాజ్, లలిత, క్రాంతిబాబు, అంజయ్యయాదవ్, జీవీకే ఫణీంద్ర, కాలనీవాసులు పాల్గొన్నారు.
డివిజన్ పరిధిలోని బాలాజీ ఎన్‌క్లేవ్‌లో రూ.3 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కార్పొరేటర్ నర్సింహయాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కార్పొరేటర్ స్పందించి రూ.1.లక్షల 50 వేలు నగదు అందజేయడం హర్షణీయం అన్నారు.