మేడ్చల్ కలెక్టరేట్, నవంబర్ 13: మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కోట్ల రూపాయలు మంజూరు చేశాడని కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని 8, 13, 14, 15వ వార్డుల్లో ఆదివారం రూ.7.11కోట్లతో సీసీ రోడ్లు, అంతర్గత మురికి కాలువ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన సభలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని అన్నారు.
గత ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి సారించలేదని, మన తెలంగాణ ప్రభుత్వం నేడు గ్రామాలు,పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మంజూరు చేసి నిధులతో నేడు సీవరేజీ పైప్‌లైన్ పనులు, సీసీరోడ్లు, అంతర్గత మురికి కాలువలు, వైకుంఠధామాలు, చెరువులు సుందరీకరణ, లింక్ రోడ్ల విస్తరణ పనులు చేపడుతన్నట్లు ఆయన తెలిపారు. చెత్త డంపింగ్ యార్డుతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కోట్ల రూపాయలతో విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి విద్యుత్‌ను తయారు చేస్తున్నారని, మురుగు నీటిని శుద్ధిచేసి తాగునీరు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీలో భాగంగా ఇం టింటికీ తాగునీరు అందిస్తున్నారని, గతంలో 15 రోజులకు కూడా నీరు వచ్చేది కాదని, నేడు పైప్లైన్లు ఏర్పాటు చేసి ప్రత్యేక ట్యాంకుల ద్వారా ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని ఇస్తున్న ఘనత కేసీఆర్‌దే అని అన్నారు. మురుగు నీరు చెరువులలోకి చెరకుండా దమ్మాయిగూడ రూ. 7కోట్లతో సీవరేజీ పైప్‌లైన్ పనులను పూర్తి చేశామని, నాగారంలో సీవరేజీ పైప్‌లైన్ పనులకు రూ. 8 కోట్ల మంజూరు అయ్యాయని చెప్పారు.
దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీలలో లింక్ రోడ్ల విస్తరణకు పనులు త్వరలోనే మొదలవుతాయని అన్నారు.దమ్మాయిగూడ నాసింగ్ చెరువును మినీట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దుతామని, కోమటికుంట చెరువును సుందరీకరించి వాకింగ్ ట్రాక్‌ను నిర్మిస్తామని చెప్పారు. ప్రజలు సమస్యలు ఉంటే కౌన్సిలర్లు, చైర్మన్ దృష్టికి తీసుకరావాలని, లేదంటే తన దృష్టికి తీసుకువస్తే సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాం త్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కమిషనర్ ఎ.స్వామి, కౌన్సిలర్లు స్వప్న హరిగౌడ్, రమేశ్‌గౌడ్, నర్సింహారెడ్డి, అనురాధ యాదగిరి గౌడ్, పావని నరేందర్ రెడ్డి, సురేఖ భాస్కర్ గౌడ్,వెంకటరమణ, కో-ఆప్షన్ సభ్యులు వహి దా ఖాజామియా, రజిని వినయ్, కీసరగుట్ట ట్రస్ట్ బోర్డు సభ్యులు సాయినాథ్‌గౌడ్, టీఆర్ఎస్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి హరిగౌడ్, యూత్ అధ్యక్షులు మణికంఠ ముదిరాజ్, నాయకులు రాములు, నరహరిరెడ్డి, కార్తిక్‌గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ఖాజామియా, భాస్కర్‌గౌడ్, అనిల్, వినయ్, హెచ్ఎండీఏ,మున్సిపల్ అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.