అబిడ్స్, నవంబర్ 13 : ఖైరతాబాద్ జోన్ పరిధిలో రహదారుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గుం తలు పడ్డ రోడ్లకు జీహెచ్ఎంసీ అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు. లక్డీకాపూల్, ఏసీ గార్డ్స్, మెహిదీపట్నం రాయల్ కాలనీ, ఐటీ టవర్స్ జంక్షన్, గోకుల్ న గర్ జంక్షన్ తదితర ప్రాంతాల్లో డీబీఎం లేయింగ్ ప నులు చురుకుగా జరుగుతున్నాయి. ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ ఆధ్వర్యంలో గోషామహల్, నాంపల్లి, కార్వాన్ సర్కిళ్లలో పనులు చేపడుతున్నారు. జోనల్ కమిషనర్ రవికిరణ్ ఆదేశాలతో ఎస్ఈ పర్యవేక్షణలో ఆయా సర్కిళ్లలో ఇంజినీరింగ్ అధికారులు పనులు ముమ్మరం చే శారు. వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా రాత్రి వేళల్లో పనులు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
మెహిదీపట్నం, నవంబర్ 13 : ప్రజలకు రోడ్లపై ప్రయాణం సాఫీగా సాగేలా జీహెచ్ఎంసీ అధికారులు రోడ్ల గుంతలకు మరమ్మతులు చేపడుతున్నారు. నాం పల్లి నియోజకవర్గం ఆసిఫ్‌నగర్, మల్లేపల్లి డివిజన్లలో ఉన్న ప్రధాన రోడ్లలో గుంతలు ఏర్పడ్డాయి. వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయంపై ఫిర్యాదులు రావడంతో సర్కిల్ -12 ఇంజినీరింగ్ వి భాగం అధికారులు స్పందించారు. రోడ్ల గుంతలకు బీటీ ప్యాచ్ వర్క్ మరమ్మతులు పూర్తి చేశారు. ఆసిఫ్‌నగర్ డివిజన్లోని ఇందిరానగర్, మల్లేపల్లి డివిజన్లోని హబీబ్‌నగర్ – నాంపల్లి ఏరియా దవాఖాన ప్రధాన రోడ్డులో బీటీ రోడ్ల గుంతలను బీటీతో పూడ్చారు. గుంతలకు మరమ్మతులు చేయిస్తున్నామని ఈఈ లాల్‌సింగ్ తెలిపారు.