Hyderabad | కిన్నెర గ్రాండ్ హోటల్లో కుప్పకూలిన లిఫ్ట్.. 8 మందికి గాయాలు
Hyderabad | నాగోల్ - అల్కాపురి ఎక్స్ రోడ్డులో ఉన్న కిన్నెర గ్రాండ్ హోటల్లో ప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తు నుంచి సెల్లార్‌కు రావాల్సిన లిఫ్ట్ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Hyderabad | హైదరాబాద్ : నాగోల్ – అల్కాపురి ఎక్స్ రోడ్డులో ఉన్న కిన్నెర గ్రాండ్ హోటల్లో ప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తు నుంచి సెల్లార్‌కు రావాల్సిన లిఫ్ట్ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. కిన్నెర గ్రాండ్ హోటల్లోని నాలుగో అంతస్తులో ఆదివారం ఓ ఫంక్షన్ జరిగింది. ఆ వేడుకకు అతిథులు తరలివచ్చారు. అయితే ఓ 8 మంది నాలుగో ఫ్లోర్లో లిఫ్ట్ ఎక్కి సెల్లార్‌కు వచ్చేందుకు బటన్ నొక్కారు. క్షణాల్లోనే ఆ లిఫ్ట్ కుప్పకూలిపోయింది. దీంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారు గట్టిగా అరవడంతో అప్రమత్తమైన హోటల్ సిబ్బంది సెల్లార్‌కు వచ్చి లిఫ్ట్ డోర్లను బ్రేక్ చేసి, వారిని బయటకు తీశారు. అనంతరం ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్‌కు 108 అంబులెన్స్‌లో తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కిన్నెర గ్రాండ్ హోటల్‌పై నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

Kinnera Lift1
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

